NTV Telugu Site icon

తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు తరలివెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు…

ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంటే ఇప్పుడు తౌక్టే తుఫాన్ కలకలం రేపుతోంది. అయితే తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తరలివెళ్లాయి. ఈనెల 18న గుజరాత్ వద్ద తీరం దాటనుంది తౌక్టే. వాతావరణ హెచ్చరికలు, కేంద్రం ఆదేశాలతో ప్రభావిత రాష్ట్రాలకు 126 మందితో కూడిన విజయవాడ ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్ళింది. విపత్తు సమయంలో సహాయక చర్యల సామగ్రితో బయలుదేరిన బలగాలు… గన్నవరం విమానాశ్రయం నుంచి మూడు ప్రత్యేక వాయుసేన విమానాల్లో ఆయా రాష్ట్రాలకు వెళ్లాయి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు.