కుప్పం పర్యటనలో నారా లోకేష్ వైసీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని… అడ్డగోలుగా తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతుల పై లాఠీఛార్జ్ అమానుష ఘటన అని ఫైర్ అయ్యారు.ఖాకీలు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా… ? వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తమ నాన్న చంద్రబాబు కాస్త సాఫ్ట్ అని.. కానీ తాను అలా కాదని వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్. త్వరలో ప్రజా ఉద్యమం రానుందని… అందులో గాలిగాడు జగన్ కొట్టుకు పోతాడని హెచ్చరించారు. 2024 లో టిడిపి విజయం ఖాయమని… దొంగ సంతకాలతో 14వ వార్డు ఏకగ్రీవం చేసుకున్నారని నిప్పులు చెరిగారు. కుప్పం లో రౌడీలు, స్మగ్లర్ దిగారని మండిపడ్డారు.
మా నాన్న సాఫ్ట్, నేను కాదు : వైసీపీకి లోకేష్ వార్నింగ్
