ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. అసూయకు మందు లేదని.. ఇంత అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీలు వస్తాయన్న జగన్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అసూయకు అన్న లాంటి వాడు సీఎం జగన్ మోహన్ రెడ్డేనని. అందుకే నాన్న, బాబాయ్‌కు టికెట్ తీసి పంపేశాడని లోకేష్ ఆరోపించారు. మరోసారి సీఎం జగన్ అసూయతో గర్వం దాల్చాడని.. ఈ సారి గుండెపోటు తల్లికో.. చెల్లికో..? అంటూ లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గురువారం సీఎం జగన్ మాట్లాడిన వీడియోను కూడా లోకేష్ ట్యాగ్ చేశారు.
అసూయ కి అన్న లాంటి వాడు @ysjagan.
అందుకే నాన్న, బాబాయ్ కి టికెట్ తీసి పంపేసాడు. మరోసారి ఆయన అసూయతో గర్వం దాల్చాడు. ఈ సారి గుండెపోటు తల్లికో! చెల్లికో? pic.twitter.com/VaLqzPlqGV— Lokesh Nara (@naralokesh) April 7, 2022
మరోవైపు ఏపీలో జగన్ చేతకాని పాలన, అవినీతి దాహం, బంధుప్రీతి వల్ల ఆయన పార్టీ నేతలు బలవుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతుల బిల్లులు కాంట్రాక్టర్లకి చెల్లించకపోవడంతో ఎవరూ కనీసం రోడ్డుపై గుంతల్లో తట్టెడు మట్టి కప్పడానికి ముందుకు రావడంలేదని లోకేష్ విమర్శలు చేశారు.
.@ysjagan చేతకాని పాలన, అవినీతి దాహం, బంధుప్రీతి వల్ల ..ఆయన పార్టీ నేతలూ బలవుతున్నారు. ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతుల బిల్లులు కాంట్రాక్టర్లకి చెల్లించకపోవడంతో ఎవరూ కనీసం గుంతలో తట్టెడు మట్టి కప్పడానికి ముందుకు రావడంలేదు.(1/4) pic.twitter.com/06aXSKT2XA
— Lokesh Nara (@naralokesh) April 7, 2022
