Site icon NTV Telugu

మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచి కానుకగా ఇస్తాం : లోకేష్

nara-lokesh

nara-lokesh

పార్టీ కార్యాలయంపై దాడి చేయండని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారు అని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారు. కొన్ని పిల్లులు పులులమనుకుంటున్నాయి. ఒక చెంప కొడితే రెండు చెంపలు కొడతాం. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం. ఏపీలోనే కాదు.. దేశంలో ఎక్కడున్నా వదిలి పెట్టం. మా పార్టీ కార్యాలయంలో పగిలినవి.. అద్దాలే మా కార్యకర్తల గుండెలు బద్దలు కొట్టలేరు. మాది పేటీఎం బ్యాచ్ కాదు.. పసుపు సైన్యం. రెండున్నరేళ్లు ఓపిక పడితే చంద్రబాబు సీఎం అవుతారు. 2019 ముందు నాపై ఏ కేసూ లేదు.. ఏ పోలీస్ స్టేషనుకు వెళ్లలేదు అన్నారు.

అయితే జగన్ సీఎం అయ్యాక నాపై హత్యాయత్నం సహా 11 కేసులు పెట్టారు. జగన్ తరహాలో నేనేం మా చిన్నాన్న జోలికెళ్లలేదు. జగన్ మగాడైతే చిన్నాన్న హత్య కేసును తేల్చాలి. హత్యాయత్నం కేసులు పెడితే నా బండి ఆగదు.. మరింత స్పీడుగా వెళ్తుంది. చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెడుతోన్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. 2024లో మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచి కానుకగా ఇస్తాం. ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూపించాం.. వైసీపీకి పెద్ద సినిమా చూపిస్తాం అని పేర్కొన్నారు.

Exit mobile version