టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ.. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందంటూ సెటైర్లు వేశారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా ఆడుతున్నారని, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతరకు జగన్ జడుసుకున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని, మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ దుస్థితి చూస్తుంటే జాలేస్తుందంటూ నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడింది. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుంది.(1/3) pic.twitter.com/u7KIS1pmq4
— Lokesh Nara (@naralokesh) June 19, 2022
