Site icon NTV Telugu

Nara Lokesh: దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ!

Nara Lokesh

Nara Lokesh

దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్‌గా విశాఖ తయారవుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా చేస్తున్నారన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామన్నారు. ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నామని చెప్పారు. 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ సహకరిస్తున్నారని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

Also Read: Piyush Goyal: ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడే.. పీయూష్ గోయెల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ‘ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి విజనరీ లీడర్ల నేతృత్వంలో భారత దేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం అవుతున్నాయి. ప్రస్తుతం 7 ఆపరేషన్ ఎయిర్ పోర్టులు ఉంటే కొత్తగా మరో 7 ఎయిర్ పోర్టులు నిర్మాణం చేస్తాం. ఏరోస్పేస్, ఎయిర్ క్రాఫ్ట్ తయారీని కూడా ఏపీకి తీసుకువస్తాం’ అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Exit mobile version