ADR Report Report on AP MLC Assets: పెద్దల సభగా భావించే శాసనమండలిలో సగానికి పైగా సభ్యులు నేరచరితులే ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ తాజా నివేదిక వెల్లడించింది. ఏపీ శాసన మండలిలో ఉన్న 58మంది సభ్యుల్లో 48మంది వివరాలను విశ్లేషించిన తర్వాత అందులో 20మందికి పైగా ఎమ్మెల్సీలు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ నివేదిక తెలియజేసింది. ప్రస్తుతం వైసీపీకి శాసనమండలిలో 26మంది సభ్యులున్నారు. వైసీపీకి చెందిన 13 మంది, టీడీపీకి చెందిన ఆరుగురు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని.. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది. ఒక ఎమ్మెల్సీ హత్యాయత్నం కేసులో ఉండగా, మరో ఎమ్మెల్సీ మహిళలపై అకృత్యానికి పాల్పడ్డారన్న కేసులో ఉన్నారని తెలిపింది.
టీడీపీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, బచ్చుల అర్జుడు నామినేషన్ పత్రాలు అందుబాటులో లేకపోవడం, నామినేటెడ్ ఎమ్మెల్సీలు అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేకపోవడంతో 48మందినే ప్రమాణికంగా తీసుకున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 48 మంది సభ్యుల్లో 75 శాతం మంది ధనవంతులే ఉన్నారని తెలిపింది. మొత్తం సభ్యుల్లో 36మంది సభ్యులు కోటీశ్వరులు ఉన్నారని.. వైసీపీ ఎమ్మెల్సీలలో 22మంది కోటీశ్వరులు ఉంటే టీడీపీ ఎమ్మెల్సీలలో 11మంది కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ నివేదిక తెలియజేసింది. ఆస్తులు, ఆదాయం విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. నారాలోకేష్‌కు రూ.369కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన తర్వాతి స్థానంలో వైసీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు. ఆయనకు రూ.101 కోట్ల రుపాయల ఆస్తులున్నాయి. మూడో స్థానంలో రూ.36కోట్లతో ఎమ్మెల్సీ మాధవరావు నిలిచారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ పి.రఘువర్మకు అతి తక్కువగా రూ.1,84,527 ఆస్తులు మాత్రమే ఉన్నాయి.
Read Also: Uttar Pradesh: ఇంటిపై పాకిస్తాన్ జెండా.. వ్యక్తి అరెస్ట్
అప్పుల విషయానికి వస్తే కేఈ ప్రభాకర్ (టీడీపీ) రూ.16.25 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. నారా లోకేష్ (టీడీపీ) రూ.6.27 కోట్లు, చిన్న గోవింద రెడ్డి దేవసాని (వైసీపీ) రూ.5.23 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. ఎమ్మెల్సీలలో 8 మంది 5-12తరగతుల వరకు చదువుకోగా 40మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు, 8మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఐదుగురు గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్, నలుగురు ఇంటర్, ఒకరు టెన్త్, ఒకరు ఐదో తరగతి వరకు చదువుకున్నారు.