Site icon NTV Telugu

Nara Lokesh: ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అవసరం లేదు..

Lokesh

Lokesh

Nara Lokesh: విజయవాడలో జరుగుతున్న ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్‌–2025లో ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. మన మిత్ర ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు అందిస్తోంది అన్నారు. గతంలో ఎయిర్‌పోర్టుల నిర్మాణం ద్వారా ఒక ప్రాంతం రూపురేఖలు ఎలా మారిందో చూశాం.. తెలంగాణ జీడీపీలో ఎయిర్‌పోర్ట్ వల్ల ఆదాయం 17 నుండి 18 శాతం వరకు పెరిగిందని చెప్పుకొచ్చారు. అదే విధంగా క్వాంటమ్ అమరావతిలో గేమ్‌చేంజర్‌గా మారుతుంది.. యూఏఈ ప్రపంచంలో తొలిసారి ఏఐ మంత్రిని నియమించిన దేశంగా గుర్తించబడింది అని భావిస్తున్నానని నారా లోకేష్ వెల్లడించారు.

Read Also: Nazriya–Fahadh: విడాకుల గాసిప్‌కు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ జంట !

ఇక, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఏఐ టెక్నాలజీని అనుసరిస్తూ హ్యాకథాన్‌లు నిర్వహిస్తోంది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం కొందరిలో ఉంది. కానీ, పారిశ్రామిక విప్లవం తరువాత ఉద్యోగాలు ఎలా పెరిగాయో మనం చూశామన్నారు. అదే తరహాలో ఏఐ కూడా కొత్త ఉద్యోగ అవకాశాలను తెస్తుంది అని భరోసా కల్పించారు. ఇంకా ఎవరూ క్వాంటమ్ గురించి మాట్లాడక ముందే, మేము దాని యూజ్‌కేసులు గురించి చర్చలు ప్రారంభించాం.. నాకు ఏఐ ఒక జీవన విధానంలా మారింది.. బేసిక్ డ్రాఫ్టింగ్, మీటింగ్‌ల సారాంశాన్ని తయారు చేయడం లాంటి పనుల్లో నేను ఏఐను ఉపయోగిస్తున్నాను అని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు.

Exit mobile version