Site icon NTV Telugu

మాట మార్చుడు.. మడమ తిప్పుడు జగన్ నైజమా?

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు సీఎం జగన్ అంటూ మండిపడ్డారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు.

పైగా జగన్ కు అవగాహన లేకే సిపిఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా సలహాదారుడు సజ్జల ప్రకటించడం ఉద్యోగులని దారుణంగా మోసగించడమే. నెరవేర్చని హామీలిచ్చి వంచించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలి. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేస్తోన్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు లోకేష్.

Exit mobile version