దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీకి 3వ స్థానం లేచింది అని చెప్పిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలోని అరాచకపాలన వల్లే అన్నదాతల ఆత్మహత్మలు చేసుకుంటున్నారు అని అన్నారు రోజుకి సగటున ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వైసీపీ సర్కారు తీరుతో రెండున్నరేళ్లలో 34 శాతం పెరిగిన ఆత్మహత్యలు. ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతుల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. జగన్ సీఎం అయ్యాక ఒక్క 2020 సంవత్సరంలోనే 889 మంది రైతులు బలవన్మర ణాలకు పాల్పడ్డారు. 2018 సంవత్సరంలో పోల్చుకుంటే, జగన్ పాలనలో 34 శాతం రైతు ఆత్మహత్యలు అధికమయ్యాయి. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. దేశంలోనే 22 శాతం కౌలు రైతుల మరణాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.
అందుకే అన్నదాతల ఆత్మహత్మలు చేసుకుంటున్నారు : నారా లోకేష్
