NTV Telugu Site icon

Nara Lokesh : కొత్త రాజధాని విశాఖ అని ఏం పీకారు

తనను, తన కుటుంబాన్ని అవమానపర్చే విధంగా కథనాలను ప్రచురించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరువు నష్టం దావా వేశారు. సాక్షి పత్రికలో తనను కించపరుస్తూ కథనాలను ప్రచురించినందున 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు విశాఖకు నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కేసు వచ్చే నెల 14 వాయిదా వేసారని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావోద్దని కోర్టు తెలిపిందన్నారు. తప్పుడు వార్తలు ఎవ్వరు రాసిన ఊరుకోనేది లేదని, ఇంకా ఎన్నాళ్ళు మాపై తప్పుడు వార్తలు రాస్తారని, జగన్ లాగా 16 నెలలు జైల్ కి వెళ్లి కోర్టు కి రాలేదు…న్యాయం కోసం వచ్చానన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఓ ఫ్యాక్షనిస్టు వ్యాపారాలన్నీ తానే చేయాలని రాష్ట్రంలో ఉన్న మిగతా వారిని వేధిస్తూ భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పై పడ్డారని, ఇండియాలో ఎక్కడా లేని షరతులు పెట్టారు… రాష్ట్రంలో సిని ఇండస్ట్రీ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా కొత్త రాజధాని విశాఖ అని ఏం పీకారని ఆయన ధ్వజమెత్తారు.