NTV Telugu Site icon

Nara Lokesh : జగన్‌ చిత్రపటానికి మద్యాభిషేకం..

TDP National Secretary Nara Lokesh Fired on Cheep Liquor J Brands in Andhra Pradesh.

ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ నిరసనలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో టీడీపీ శాసన సభాపక్షం నిరసనలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా సీఎం జగన్‌ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసి వారి నిరసన తెలిపారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వ‌ర‌కు టీడీపీ శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. మద్య నిషేధంపై ఇచ్చిన హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో మ‌ద్యం ఏరులైపారుతోందంటూ విమ‌ర్శించారు. దాని వ‌ల్ల‌ వందలాది మంది చనిపోతున్నారని ఆరోపించారు.

ఏపీలో కరోనా కంటే ఎక్కువగా కల్తీసారాతో చనిపోయారని ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రూ.25 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం మరణాలపై న్యాయ విచారణ జరపాల‌ని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నప్ప‌టికీ ప్ర‌భుత్వంలో మార్పు లేద‌న్నారు.