NTV Telugu Site icon

Chandrababu: “అమరావతి” పేరు వెనుక రామోజీరావు

Rrrrrrrrrrr

Rrrrrrrrrrr

Ramoji Rao Death News: పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఈ రోజు ఉదయం 4.50 గం.కు ఆయన కన్నుమూశారు. అనంతరం ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటున్నారు.

Also Read; Ram Charan: రామోజీ రావు మృతి.. గేమ్ ఛేంజర్ షూట్లో రామ్ చరణ్ అశ్రు నివాళులు

అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని..కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే, రామోజీ రావు గారు పరిశోధన చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా “అమరావతి” పేరు బాగుంటుంది అని చెప్తే, అందరి అభిప్రాయం తీసుకుని, “అమరావతి” అని మన రాజధాని పేరు పెట్టుకున్నాం అని రామోజీ రావు గారి గురించి, గతంలో చంద్రబాబు గారు చెప్పిన మాటలు….