NTV Telugu Site icon

Nara Brahmani: చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేరమా..?

Nara Brahmani

Nara Brahmani

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమండ్రిలో తెలుగు మహిళలతో కలిసి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి తిలక్ రోడ్డు నుంచి కటారినగర్ రామాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ముందుగా సాయిబాబా ఆలయం, రామాలయాల్లో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై పెట్టిన కేసులు అక్రమం, ఇవి కక్ష సాధింపు కేసులు అన్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేతను, విజనరీ లీడర్ ను. అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ ఆమె పేర్కొన్నారు. ఎలాంటి ఎవేడేన్స్ లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారు.. లక్షలాది మందికి స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చేశారు.. సంక్షేమం చేయడం నేరమా అని బ్రహ్మణి అడిగారు.

Read Also: I.N.D.I.A. First Rally: భోపాల్లో రద్దైన కూటమి మొదటి ర్యాలీ.. నెక్స్ట్ ఎక్కడంటే..!

ఇప్పుడున్న ప్రభుత్వం యువతకు గంజాయి లిక్కర్ తప్ప ఏమి ఇస్తుంది అని నారా బ్రహ్మణి ప్రశ్నించారు. మాకు మద్దతు ఇచ్చిన జాతీయ నాయకులకు ఐటి ఉద్యోగులందరికి నా ధన్యవాదాలు అంటూ ఆమె చెప్పారు. లోకేష్ ఒకచోట.. మేము ఒకచోట తిరుగుతున్నాను.. నాలాంటి యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన తప్పా అంటూ బ్రహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తారేమో?.. రిమాండ్ రిపోర్ట్ చదివితే ఎనిమిదేళ్ళ దేవన్ష్ అయిన అందులో ఏం లేదని చెప్తాడు.. ఇప్పుడు మేము ఒంటరి వాళ్ళం కాదు.. మా వెనక టీడీపీ కుటుంబం ఉంది అని ఆమె పేర్కొన్నారు.

Read Also: Komati Reddy Venkat Reddy: తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా.. ఇంటికి పోతరా.. జైలుకు పోతరా..!

న్యాయ వ్యవస్థలపై మాకు విశ్వసం ఉంది అని నారా బ్రహ్మణి అన్నారు. చంద్రబాబుకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మా కుటుంబానికి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని అన్నారు. లోకేష్ ఢిల్లీలో మా అత్తయ్య రాజమండ్రిలో, నేను విజయవాడలో, నా కుమారుడు హైదరాబాద్ లో ఉండవలసి వస్తుందన్నారు. మాది స్ట్రాంగ్ కుటుంబం ఇలాంటి వాటికి మేం బెదిరిపోమని బ్రహ్మణి అన్నారు.