Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో.. మల్లికార్జునస్వామిగా దర్శనం ఇస్తారు ఆ పరమేశ్వరుడు.. నిత్యం వేలాది మంది భక్తులు మల్లికార్జునస్వామి, భ్రమరాంబ మాత దర్శనానికి తరలివస్తుంటారు.. అయితే, శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై సస్పెన్షన్ వేటు వేసింది పాలకమండలి.. 10 రోజుల క్రితం కొందరు అన్యమతస్తులు ఆలయ సందర్శనకు వచ్చినట్లు గుర్తించారు.. వారి దగ్గర అన్యమత పుస్తకాలు ఉండటంతో క్యూ లైన్స్ వద్ద తిరిగి వెనక్కి పంపించారు సెక్యూరిటీ సిబ్బంది.. అయితే, సీఎస్‌వోగా ఉన్న అయ్యన్న ఉద్యోగ బాధ్యతలపై నిర్లక్ష్యంగా ఉండటంపై ఈవో సస్పెండ్ చేస్తూ శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.. అన్యమతస్తులు శ్రీశైలంలో హల్‌చల్ చేశారని ఆరోపణలు.. ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. చీఫ్ సెక్రూరిటీగా ఉన్న అయ్యన్నను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు..
Read Also: Retro : రెట్రో కలెక్షన్లు.. సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్..
