Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం సృష్టించింది.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.. శ్రీశైలంలోని పాతాళగంగ సమీపంలో మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. స్థానికులు, భక్తులకు అలర్ట్ జారీ చేశారు.. శ్రీశైలం వచ్చే భక్తులు.. ముఖ్యంగా పాతాళ గంగలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేశారు.. అయితే, శ్రీశైలంలోని ఆదే గృహంలో గతంలో కూడా పలు సార్లు చిరుత సంచరించినట్టు అధికారులు చెబుతున్నారు.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
మొత్తంగా.. పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం భక్తులు, స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. పాతాళగంగకు వెళ్లే మెట్ల మార్గం సమీపంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంటి పరిసరాల్లో చిరుత తిరుగుతున్న వీడియో బయటకు రావడంతో, ఆలయ పట్టణంలో ఒక్కసారిగా భయ వాతావరణం నెలకొంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు, దర్శనానికి వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాలు, మెట్ల మార్గంలో తిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా ఎప్పటికప్పుడు అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు. రాత్రి వేళ ఒంటరిగా సంచరించవద్దని, చిన్న పిల్లలను బయటకు పంపవద్దని సూచనలు జారీ చేశారు. చిరుత కదలికలు నమోదైన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి, ట్రాప్ కెమెరాలు, పాదముద్రల పరిశీలన, గస్తీ పెంపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మెట్ల మార్గం ప్రాంతం కావడంతో, రక్షణ చర్యలు మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
