NTV Telugu Site icon

Lady Aghori Naga Sadhu: వేషం మార్చిన అఘోరీ.. మహానంది క్షేత్రంలో ప్రత్యక్షం

Lady Aghori Naga Sadhu

Lady Aghori Naga Sadhu

Lady Aghori Naga Sadhu: వస్త్రాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తిరిగి వివాదాలను సృష్టించారు అఘోరీ నాగసాధు. నిన్న కర్నూలు రోడ్లపై వస్త్రాలు లేకుండా తిరిగి హల్చల్ చేశారు. అయితే, తెల్లవారేసరికి మహానంది క్షేత్రంలో ప్రత్యక్షమయ్యరామే. కర్నూలులో ఆమె సొంత కారు పాడైపోవడంతో ప్రైవేట్ కారులో వచ్చారు అఘోరీ నాగసాధు.

Read Also: West Bengal : బెంగాల్‌లో తప్పిన భారీ రైలు ప్రమాదం… పట్టాలు తప్పిన మూడు కోచ్‌లు

ఇక, కాషాయ వస్త్రాల్లో వచ్చిన అఘోరి నాగసాధుకు స్వాగతం పలికారు ఆలయ సిబ్బంది , పూజారులు. అనంతరం ఆమె మహానందిశ్వర స్వామి, కామేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.. ఆమెకు ఆశీర్వచనాన్ని అందించారు ఆలయ పూజారులు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసమే తాను పర్యటిస్తున్నారు అన్నారు.. ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, మహిళలకు రక్షణ కల్పించడం, గోహత్యలను నివారించడం తన లక్ష్యమన్నారు. భక్తులందరూ తమ తమ పనులను భక్తిశ్రద్ధలతో చేసుకుంటూ లోక కల్యాణం కోసం పాటుపడాలన్నారు అఘోరి నాగసాధు..

Read Also: UnstoppableS4 : సూర్య ఫస్ట్ క్రష్ ఏ హీరోయిన్ అంటే..?

మరోవైపు.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రాన్నీ లేడీ అఘోరి సందర్శించి శ్రీ ఉమా మహేశ్వర స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. మొన్నటి వరకు దిగంబరంగా తిరుగుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివిధ ఆలయాలను సందర్శిస్తూన్న అఘోరి ప్రస్తుతం ఎర్రటి వస్త్రం ధరించి యాగంటి క్షేత్రానికి వచ్చారు. ఈ సందర్భంగా , అఘోరి మాట్లాడుతూ సనాతన ధర్మం కాపాడడం కోసమే నా పోరాటమని, స్పష్టం చేశారు మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల జరుగుతున్న దారుణ అఘాయిత్యాలు, నియంత్రించాలని, ఆలయాల పై జరుగుతున్న దాడులు, గోవుల వధ ను ఆపేయాలని పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంత వరకు నా ప్రయాణం కొనసాగు తూనే ఉంటుందని వెల్లడించారు. త్వరలో జరగనున్న కుంభమేళాకు మూడు రోజులపాటు వెళ్లి తిరిగి రానున్నట్లు అఘోరి తెలిపారు, లేడి అఘోరీ యాగంటి క్షేత్రానికి రానుండటం తో ఎలాంటి వివాదం చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Read Also: AHA : ‘రైటర్స్ టాలెంట్ హంట్’ అనౌన్స్ చేసిన ‘ఆహా’

కాగా, శ్రీకాళహస్తి ఆలయంలో మహిళా అఘోరి ఆత్మార్పణకు యత్నించడం తీవ్ర కలకలం రేగిన విషయం విదితమే.. ఆలయానికి వెళ్లిన అఘోరిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన ఆమె.. ఆలయంలోకి అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణకు సిద్ధమైంది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.. ఆ తర్వాత ఆమె వస్త్రాలు ధరించడంతో ఆమెను దర్శనానికి అనుమతి ఇచ్చిన విషయం విదితమే.. అంతేకాకుండా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటన కొనసాగించారు. పిఠాపురంలో పాదగయ క్షేత్రానికి అఘోరి నగ్నంగా వెళ్లారు.. పాదగయలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి పురోహుతికా అమ్మవార్లకు అఘోరి పూజలు చేసింది. ఈ క్రమంలో అఘోరిని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. కాగా మహిళ అఘోరీ సోమవారం రాత్రి విశాఖపట్నానికి చేరింది. నాగుల చవితి సందర్భంగా మంగళవారం ఉదయం జోడిగుడ్లపాలెంలోని నాగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఇలా రాష్ట్రంలోని పలు క్షేత్రాల్లో ఆమె పర్యటన కొనసాగుతోన్న విషయం విదితమే..

 

Show comments