Site icon NTV Telugu

Nandyal: చనిపోయిన స్నేహితుడి కుమార్తె పెళ్లి చేసిన బాల్య మిత్రులు..

Ndl

Ndl

Nandyal: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం పుట్టాలమ్మ క్షేత్రంలో కొందరు బాల్య మిత్రులు కలిసి చనిపోయిన స్నేహితుడి కుమార్తె వివాహం జరిపించారు. ఈ సందర్భంగా పెళ్లి పెద్దలుగా మారి పెళ్లి కూతురి పల్లకి సైతం మోశారు. 18 సంవత్సరాల క్రితం మృతి చెందిన రుద్రవరం మండలం నల్లవాగుల పల్లె ప్రభాకర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చూసుకుంటున్న ప్రభాకర్ భార్య సువర్ణ.. స్నేహితుడి మృతి తర్వాత అతని కుటుంబానికి బాల్య మిత్రులు అండగా నిలిచారు. ఇక, పెద్ద కుమార్తె లక్ష్మీకి ఆళ్లగడ్డ మండలం బాచేపల్లెకు చెందిన పవన్ తో పెళ్లి నిశ్చయమైంది.

Read Also: Thamasur : ‘థామసూర్‌’లో యామీ – అదా కాంబినేషన్‌.. హారర్‌కి హాట్ టచ్‌!”

ఇక, రామతీర్థం పుట్టాలమ్మ ఆలయంలో లక్ష్మీ వివాహాన్ని తండ్రి బాల్య స్నేహితులు దగ్గరుండి వైభవంగా జరిపించారు. దగ్గరుండి తన స్నేహితుడి కుమార్తె పెళ్లి పనులు చూసుకున్న బాల్య స్నేహితులు.. స్నేహమంటే వీళ్లదేరా అంటూ బాల్య స్నేహితులను స్థానికులు అభినందిస్తున్నారు. 1982-83లో నంద్యాల రామకృష్ణ విద్యాలయంలో ప్రభాకర్ తో కలిసి పదో తరగతి వరకు స్నేహితుల బృందం చదువుకుంది.

Exit mobile version