Site icon NTV Telugu

Big Scam In AP: ఏపీలో మరో భారీ స్కామ్.. ఎస్సీ కార్పొరేషన్ భూ పంపిణీలో అక్రమాలు..

Ap

Ap

Big Scam In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా బనగానపల్లె మండంలో ఎస్సీ కార్పొరేషన్ భూ పంపిణీలో జరిగిన అవినీతి అక్రమాలపై అధికారుల విచారణ జరుపుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ 2016 -17లో చేపట్టిన భూమి కొనుగోలు పథకంలో అక్రమాలు జరిగినట్లు సమాచారం. లబ్ధిదారుల ఫిర్యాదుతో వెలుగులోకి భారీ అవినీతి వచ్చింది. మార్కెట్ విలువ కంటే 500 రెట్లు పెంచి ఎకరానికి 6 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో రూ.1.85 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు.

Read Also: WhatsApp Update: వాట్సప్ మిస్ కాల్స్‌కి సాల్యూషన్.. కొత్త వాయిస్ మెసేజ్ షార్ట్‌కట్

అయితే, వ్యవసాయానికి పనికి రాని భూములకు భారీ మొత్తంలో నగదు చెల్లింపుల్లో అధికారులు- దళారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వచ్చాయి. జమ్ములదీన్నే, ఇల్లూరు కొత్తపేట, తమ్మడ పల్లె కైప గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు 30.57 ఎకరాల భూమిని పంపిణీ చేయగా.. ఈ భూ పంపిణీలో జరిగిన అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో రెవెన్యూ- ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు.

Exit mobile version