Site icon NTV Telugu

Avuku Reservoir: అవుకు రిజర్వాయర్ కు గండి.. మంత్రి జనార్థన్ రెడ్డి ఆదేశాలు

Avuku

Avuku

Avuku Reservoir: నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్ తిమ్మరాజు ఆనకట్ట దగ్గర రివిట్ 2 అడుగుల మేరకు కుంగింది. రిజర్వాయర్ ఆనకట్ట నుంచి నీరు లీకేజ్ అవుతూ.. బయటికి వస్తుండటం స్థానిక ప్రజల్లో భయాందోళన రేపుతుంది. రివిట్ కుంగిన ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి మట్టం 3.65 టీఎంసీల నీరు ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం అప్రమత్తం అవుతూ, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి నుంచి ఎస్సార్బీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రివిట్ కుంగిన ఘటనపై పూర్తి స్థాయి నివేదికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.

Read Also: AP Inter Exam Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

అయితే ఎస్సార్బీసీ ఉన్నతాధికారులు రిజర్వాయర్ ఆనకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. ఏ విధమైన ప్రమాదం లేదని, లీకేజీ నీళ్లు మాత్రమే బయటకు వస్తున్నాయని వెల్లడించారు. నీటి మట్టం తగ్గించేందుకు గాలేరు- నగరి కాలువలో 4 గేట్లను ఎత్తి 12,000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎస్సార్బీసీ అధికారులు, రిజర్వాయర్‌ని పూర్తిస్థాయిలో మరమ్మత్తు చేసి, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని తేల్చి చెప్పారు.

Exit mobile version