చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఆయన ఆరోపణలు నిరాధారం అన్నారు. పోలీసులకు దురుద్దేశాలు ఆపాదించవద్దన్నారు. ఏవోబీలో గంజాయి సాగు అందరికీ తెలిసిందేనని, పక్కా సమాచారం మేరకే ఏవోబీలో దాడులు చేసినట్టు ఎస్పీ తెలిపారు. నల్గొండలో భారీగా గంజాయి పట్టుబడిందని గంజాయి నివారణకు అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ రంగనాథ్ అన్నారు. పోలీసులకు రాజకీయాలతో ముడి పెట్టవద్దన్నారు.
విజయ సాయిరెడ్డి వ్యాఖ్యలపై నల్గొండ ఎస్పీ కౌంటర్
