ఆ గ్రామంపై మృత్యువు పగబట్టింది. పసికందుల ప్రాణాలను తోడేస్తోంది. మూడేళ్ళుగా వరుస మరణాలు నమోదవుతున్నాయి. చిన్నారుల అకాల చావులకు కారణాలు అం తుబట్టక జనం ఊరు వదిలిపోతున్నారు. దీంతో వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రూఢకోటలో ఏం జరుగుతోంది? ఈ మిస్టరీ మరణాల వెనుక వున్న అంతుచిక్కని రహస్యం ఏంటి? రూఢకోట….ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లోని గిరిజన గ్రామం. పెదబయలు మండల కేంద్రానికి సుమారు 50కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఒకప్పుడు మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం. దీంతో సహజంగానే అభివృద్ధి, సంక్షేమం ఆలస్యంగా రూఢకోటకు చేరాయి. ఈ క్రమంలోనే ఇక్కడ తల్లిదండ్రులు అనుభవిస్తున్న గుండెకోత వెలుగులోకి వచ్చింది.
ఇక్కడ ఏటా పదుల సంఖ్యలో శిశుమరణాలు నమోదవుతున్నాయి. అంతుబట్టని కారణాలతో పిల్లలు అర్ధాయుష్షుతో చనిపోతున్నారు. సమస్య తీవ్రత గవర్నర్ కు చేరడంతో ఆయన స్పందించి తక్షణ సహాయ చర్యలకు ఆదేశించారు. మళ్ళీ ఏడాది తిరిగింది. గ్రామంలో పిల్లల చావులు మొదలయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు ముగ్గురు మృత్యు వాతపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం రూఢకోట గ్రామంలో రెండేళ్ళుగా సంభవిస్తున్న మరణాలు మిష్టరీగా కనిపిస్తున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 4 ఏళ్ల లోపు చిన్నారుల అంతు చిక్కని అనారోగ్య సమస్యతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఏడా ది మళ్ళీ పిల్లల మరణాలు నమోదవ్వడంతో జాతీయ గిరిజన సంఘం రూఢ కోటలో పర్యటించింది. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2018 నుండి 2022 వ
రకు 22 మంది చిన్నారులు మృత్యువాతపడినట్టు నిర్ధారించుకుంది.
ఇక్కడ మరో ట్రాజడీ ఏంటంటే మరణాలు అన్నీ దాదాపుగా ఒకే వీధిలో సంభవిస్తున్నవే కావడంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. 11కుటుంబాల్లో విషాధం చోటు చేసుకోగా ఒక్కో ఇంటి నుంచి ముగ్గురేసి చొప్పున మరణించడంతో ఆందోళనలు నెలకొంటున్నాయి. గత ఏడాది రూఢకోటలో మరణాలపై ప్రభుత్వం వైద్యుల కమిటీని నియమించి విచారించింది. తల్లిపాలు ఎక్కువగా తాగడం కారణంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి చనిపోతున్నారనే అభిప్రాయం కలిగించడం సరైంది కాదంటున్నారు గ్రామస్ధులు.
గత ఏడాది రూఢకోట ఆవేదన బాహ్య ప్రపంచం వెలుగు చూసినప్పుడు తక్షణ రక్షిత మం చినీటి ప్రాజెక్ట్ చేపడతామని యంత్రాంగం హామీ ఇచ్చింది. కోటిముప్పై లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ మంమంజూరు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలోకి రాలేదనేది ఆరోపణ. ఈ నేపథ్యంలో పిల్లలు వున్న తల్లిదండ్రులు గ్రామం వదిలిపోతున్నారు. ఇక్కడ వుంటే మరణం తప్పదనే భయం వాళ్ళను వెంటాడుతోంది. రూఢ కోట మరణాల వెనుక మిష్టరీని చేధించడంతో పాటు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శానిటేషన్ పద్ధతులపై అవగాహనకల్పించాలని, ఆ దిశగా ప్రత్యేక మెడికల్ క్యాంప్ లు పెట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Joe Biden: కోవిడ్ నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు