విజయవాడలో నూతన న్యాయస్థాన భవనాలను సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు సీఎం జగన్ పాల్గొన్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో G+7 భవనాలు నిర్మించారు. వీటిలో 29 ఏసీ కోర్టు హాళ్లు, న్యాయవాదులు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్, ఏడు లిఫ్టులు సహా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అత్యాధునిక సదుపాయాలతో ఈ నూతన భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముందు విజయవాడ చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణను సీఎం జగన్ కుటుంబ సమేతంగా కలిశారు. నగరంలోని నోవాటెల్ హోటల్‌లో ఉన్న జస్టిస్ రమణను భార్య భారతితో కలిసి సీఎం జగన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా 20 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఇది మర్యాదపూర్వక భేటీనేనని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు సీజేఐ ఎన్వీ రమణతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=D3oXx10k7S0
