Site icon NTV Telugu

జగన్ మినహా.. అన్నీ రాష్ట్రాల సిఎంలకు రఘురామకృష్ణరాజు లేఖ !

Raghu Rama

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్ని రాష్ట్రాల సిఎంలకు లేఖలు రాశారు. ఈ లిస్టులో ఏపీ సిఎం జగన్ లేకపోవడం గమనార్హం. ఏపీలో cid అధికారులు తనపై మోపిన రాజద్రోహం కేసుతో మొదలు పెట్టి ఆ తరువాత సీబీఐ కస్టడీలో దాడి ఇతర అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఈ విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజు లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాజద్రోహం శిక్షణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని.. రాజద్రోహం సెక్షన్ ను తొలగించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని అన్ని రాష్ట్రాల సీఎంలను కోరారు రఘురామ. జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడంతో.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్టు చేయించారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తనకు మద్దతు ఇచ్చేలా వారి ఎంపీలకు సూచించాలని అన్ని రాష్ట్రాల సీఎం కోరారు రఘురామ. కాగా ఇటీవలే ప్రధాని మోడీకి ఎంపీ రఘురామ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Exit mobile version