NTV Telugu Site icon

Kurnool Incident: కర్నూలులో షాకింగ్ ఘటన.. బతికున్న కూతురిని తల్లి ఖర్మకాండ

Karmakanda Daughter

Karmakanda Daughter

Mother Did Ritual To Her Daughter Who Eloped With Her Boyfriend In Kurnool: తల్లిదండ్రులు తమ పిల్లల మంచి కోసమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేదాకా.. పిల్లల్ని ఆనందంగా ఉంచడం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. తమ ఇష్టాలను చంపుకోవడంతో పాటు కడుపు మాడ్చుకొని మరీ తమ పిల్లల కడుపు నింపుతారు. తమ పిల్లల ముఖంపై చిరునవ్వు చూస్తే చాలు.. తమ కష్టాలన్నీ మర్చిపోయి, ఆనందంగా కాలం గడిపేస్తారు. కానీ.. పిల్లలే తమ తల్లిదండ్రుల ప్రేమని గుర్తించలేకపోతున్నారు. అందరూ కాదు కానీ, కొందరు మాత్రం తమ స్వార్థం కోసం తల్లిదండ్రుల్ని చాలా కష్టపెడతారు. వారి ఇష్టానికి విరుద్ధంగా నడుచుకుంటుంటారు. అలాంటి వాటిల్లో ‘ప్రేమ’ అనే భూతం కూడా ఒకటి.

Devara : దర్శకుడు కొరటాలకు అదిరిపోయే సర్ప్రైస్ ఇచ్చిన దేవర టీం..!!

అఫ్‌కోర్స్.. మనసుకి నచ్చిన వ్యక్తిని మనువాడటంలో తప్పు లేదు కానీ, తల్లిదండ్రుల ఇష్టాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంతో అల్లారముద్దుగా పెంచిన వారికి.. పిల్లల పార్ట్నర్‌ని ఎంపిక చేయడంలో హక్కు ఉంటుంది. మంచి స్థాయిలో ఉన్న కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేయాలని పేరెంట్స్ కోరుకుంటారే తప్ప, వారి జీవితం నాశనం అయ్యేలా పోకిరీలతో పెళ్లి చేయరు. కాబట్టి.. తల్లిదండ్రుల ఎంపికకి తప్పకుండా గౌరవం ఇవ్వాలి. కానీ, కొందరు మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటారు. తమ జీవితంలో నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి కోసం.. పేరెంట్స్ ప్రేమని, గౌరవాన్ని తలదన్ని, ఇళ్లు వదిలి వెళ్లిపోతారు. ఇలాంటప్పుడు కొందరు తల్లిదండ్రులు సహనం, ఓర్పు కోల్పోయి.. చేయరాని పనులు చేస్తుంటారు. కొందరు తల్లిదండ్రులు పరువుహత్యలు చేసిన సంఘటనలూ ఉన్నాయి. అయితే.. ఇక్కడ ఓ తల్లి బతికున్న కూతురికే ఖర్మకాండ నిర్వహించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Fake Police : జాబ్‌లు ఇప్పిస్తానంటూ పోలీస్‌ అవతారమెత్తిన కిలేడీ

కర్నూలు జిల్లా పెద్దకడుబూర్ మం హనుమాపురంలో ఓ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇందు అనే ఓ కుమార్తె ఉంది. ఈ యువతి ఎమ్మిగనూరు మండలం, వెంకటగిరికి చెందిన ఉరుకుందు అనే యువకుడ్ని ప్రేమించింది. అయితే.. వీరి ప్రేమని పేరెంట్స్ అంగీకరించలేదు. దీంతో.. ఇందు తన ప్రియుడితో కలిసి, ఈనెల 7వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన కూతురు ఇలా వెళ్లిపోవడంతో అవమానంగా భావించిన తల్లి.. కూతురికి ఖర్మకాండ నిర్వహించింది. ఇందు ఫోటోకి పూలమాల వేసి, ఖర్మకాండ చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.