Site icon NTV Telugu

ఏపీకి చేరిన మరో 5 లక్షలకుపైగా కోవిషీల్డ్‌ డోసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో 5.76 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కేంద్రం కేటాయించింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వీటిని వైద్య అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీటిని సరఫరా చేయనున్నారు. ఏపీకి అదనపు వ్యాక్సిన్‌ డోసులు అందడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. కాగా…రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,030 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,869 మంది పాజిటివ్‌గా తేలింది… మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,316 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్

Exit mobile version