Site icon NTV Telugu

Dokka Manikyavara Prasad: ఓటుకు కోట్లు ఆఫర్ చేసినవారిపై కేసులు పెట్టాలి

Dokka Varaprasad 1200

Dokka Varaprasad 1200

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త వివాదాలకు కారణం అయ్యాయి. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలవడంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పాత్ర పోషించారు. దీనిపై అధికార వైసీపీ తీవ్రంగా స్నందిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీ నేతలపై మండిపడుతున్నారు. ఓటుకు పది కోట్లు ఆఫర్ చేసారని రాపాక, మద్దాలి గిరి చెప్పారు. ఈ పని చేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. తెలంగాణా ఓటుకు నోటు తో కలిపి విచారణ జరపాలి. 1995 నుంచి ఎంఎల్ఏ కొనడం జరుగుతోంది వైస్రాయ్ హౌస్ లాంటి విషయాలు ఉన్నాయి.

Read Also: Dharmana Prasada Rao: అలాంటి వారిని నమ్మవద్దు.. ఓటు వేయవద్దు

పరిశోధనా సంస్ధలు ఈ విషయాన్ని క్లూ గా తీసుకోవాలి. ఉండవల్లి శ్రీదేవి కొత్తగా టిడిపి నినాదాలు పలుకుతోంది. టిడిపి వారికి సహకరించారనడానికి ఇంతకంటే రుజువు కావాలా? ఉండవల్లి శ్రీదేవి కి వచ్చిన స్క్రిప్టు మాకు తెలుసు. రాజకీయ పెద్దగానే కాకుండా కుల పెద్దగా మాట్లాడుతున్నా. ఉండవల్లి శ్రీదేవి కులాన్ని, కొందరు పెద్దవాళ్ళ పేర్లు వాడుకుని తన తండ్రికి చెడ్డ పేరు తేవద్దు. ఉండవల్లి శ్రీదేవికి ఎలాంటి భయం అవసరం లేదు. ప్రభుత్వం ఆమెకు కావల్సిన రక్షణ కల్పిస్తుందన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.

Read Also: Karnati Rambabu: కొత్త జంటలకు అమ్మవారి అద్భుత దర్శనం

Exit mobile version