Site icon NTV Telugu

ప్రతి పార్లమెంటు స్థాయిలో ఓ మెడికల్ కాలేజీ…

రెండేళ్ళల్లో సీఎం జగన్ పరిపాలనపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ… ప్రతి పార్లమెంటు స్థాయిలో ఓ మెడికల్ కాలేజీ , ప్రైవేటు రంగంలో రాజమండ్రి- లోమెడికల్ హబ్ లు ఏర్పాటుకై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బిసీ,ఎస్సీ,మైనారిటీలు కు నామినేటెట్ పదవులలో ప్రాధాన్యం ఇచ్చినట్లు… బిసీవర్గాలను ఆదుకోవడానికై 50 బిసీకార్పొరేషన్లు ఏర్పాటు చెసినట్లు పేర్కొన్నారు. రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తున్నారు. వ్యవసాయ, విద్య,వైద్య రంగాలకు సీఎంజగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలరైతులకు అండగా వుండేందుకే అమూల్ తో ఒప్పందం చేసుకున్నారు. 14వేల కోట్లు వెచ్చించి నాడు-నేడు లో బడులు ఆధునీకీకరణ జరుగుతుంది. మహిళల రక్షణకై దిశచట్టం తీసువచ్చారు. 30లక్షల 70వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది అన్నారు.

రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రభుత్వానికి ఎంతో మేలు జరిగింది.. 5వేల కోట్లు ఆదా అయింది. రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధిని తెలుగుదేశం గాలికొదిలేసింది. గత రెండేళ్ళుల్లో వైసీపీ ప్రభుత్వహయాంలో రాజానగరం ఎంతో అభివృధ్ధిని సాధించింది. రానున్న మూడేళ్ళల్లో రాజానగరం అభివృద్ధికై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. రాజానగరం నియోజకవర్గానికి ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ… తొర్రిగడ్డ ఎత్తిపోతల పధకం ఆధునీకీకరణ కై 22 కోట్లు మంజూరు చేసారు. కలవచర్లలో వంద ఎకరాలలో పారిశ్రామిక వాడ నిర్మాణం చేస్తున్నాం. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా రాజానగరం తయారు చేస్తాం. 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఇంటికి పంపేందుకు రెడీ చేశాం అని తెలిపారు.

Exit mobile version