NTV Telugu Site icon

విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు వికృత ఆనందం పొందుతున్నారు

gudivada amarnath

అద్దాల మేడలో కూర్చొని ప్రభుత్వం పై విమర్శలు చేసే పనిలో చంద్రబాబు పని పెట్టుకున్నారు ప్రతి పక్ష నాయకునిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపు కూడా లేదు. పద్నాలుగేళ్ల సీఎం గా చంద్రబాబు కొనసాగటం ప్రజలు చేసుకున్న దురదృష్టం అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆపద్బాంధునిగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఆడుకుంటే చంద్రబాబు రాబందుల్లా తయారయ్యాడు. విపత్కర పరిస్థితుల్లో వికృత అనందం చంద్రబాబు పొందుతున్నారు. కోవిడ్ తో మృతి చెందిన వారి పేరిట కొవ్వొత్తులు వెలిగించిన చంద్రబాబు గోదావరి పుష్కర మృతుల కోసం ఎందుకు కొవ్వొత్తులు వెలిగించలేదు.

వంద సంవత్సరాల్లో కరోనా లాంటి పరిస్థితి ప్రజలకు తెలియలేదు. చంద్రబాబు లాంటి మనిషిని కూడా వెయ్యేళ్ళ లో ప్రజలు చూడ లేదు. ప్రగతి భారత్ ట్రస్ట్ ద్వారా 300 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తే టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణా బోర్దర్లో ఏపీ అంబులెన్సు లు అడ్డుకుంటే కనీసం మాట్లాడని పిరికి బంద చంద్రబాబు నాయుడు. కోవిడ్ వచ్చిన తర్వాత 14 వైరాలజీ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ది. ప్రతి నియోజక వర్గానికి ఒక 104 వాహనం ఇచ్చిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఎప్పుడు చూసినా చంద్రబాబు కు రఘు రామ కృష్ణంరాజుని ఎలా కాపాడాలన్న ఆలోచన వుంటుంది అని పేర్కొన్నారు.