కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలని మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు, గృహ రుణాలు మాఫీ చేస్తామని ప్రజలను మోసం చేశారని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ప్రజల్లోకి వస్తున్నారని ఆగ్రహించారు.
వీరి మోసాలపై కరపత్రాలను విడుదల చేస్తున్నానని…వచ్చే ఎన్నికల్లో టీడీపీలో కొండబాబుకు టిక్కెట్టు రాదన్నారు. చంద్రబాబు సీఎం కావడం, కొండబాబుకు టిక్కెట్టు రావడం ఒక కలే అంటూ ఎద్దేవా చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశ పెట్టడం చాలా సంతోషమన్నారు. ఇప్పటి వరకు పట్టాగా ఉండే ఇంటి ఆస్తి ఈ పథకంతో జిరాయితీగా మారుతుందని తెలిపారు. ఇలాంటి మంచి పథకాన్ని తప్పుదోవ పట్టించి టీడీపీ ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తోందని ఫైర్ అయ్యారు.
