Site icon NTV Telugu

రాష్ట్రంలో నిరక్షరాస్యత తొలగించడమే మా లక్ష్యం…

మా ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏం చేస్తామో తూచ తప్పకుండా చేసిన పార్టీ వైసీపీ అని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మ్యానిఫెస్టోను పక్కాగా అమలుచేసిన రాజకీయ పార్టీగా దేశంలోనే ప్రఖ్యాతి పొందింది. చాలా మంది పథకాల పై అవగాహన లేకుండా హేళన చేస్తున్నారు. విద్య కోసం మేం పెడుతున్న పెట్టుబడి లాభాల కోసం కాదు. రాష్ట్రంలో నిరక్షరాస్యత తొలగించి … చక్కటి విద్యను అందించడమే మా లక్ష్యం. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. అంగన్వాడీ నుంచి ఉన్నత విద్య వరకూ అందరికీ సాయం అందిస్తున్నాం. కానీ ఇదేదో డబ్బులు పంచే కార్యక్రమం అనేలా హేళన చేయడం దురదృష్టకరం. మేం చేస్తున్న సంక్షేమం పై విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం దొరకడం లేదు. అందుకే ఏదో కారణంతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు అని పేర్కొన్నారు.

Exit mobile version