అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. విజయవాడలో… మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్య లక్ష్మి, దేవినేని అవినాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వెల్లంపల్లి మాట్లాడుతూ… అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించామన్నారు.
ఆయన రాజ్యాంగం నేటికి అమలవుతుందంటే అంబేద్కర్ గొప్ప తనం అర్ధమవుతుందని కొనియాడారు. అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తూ… అందరి అభిమానాన్ని పొందుతున్నారన్నారు. అనంతరం… ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ… అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుచా తప్పకుండా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లిడించారు. దేశంలోనే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళుతున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని తెలిపారు. సమ సమాజ న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాల వారి ఎదుగుదలకు సీఎం జగన్ చేయూత ఇస్తున్నారని వెల్లడించారు.
