దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట విషాదం చోటు చేసుకుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు తండ్రి వెలంపల్లి సూర్యనారాయణ (80) గురువారం ఉదయం స్వర్గస్తులయ్యారు. విశాఖపట్నం బ్రాహ్మణ వీధిలో ఆయన తన స్వగృహంలో సూర్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో వెల్లంపల్లి తండ్రి సూర్యనారాయణ మృతి చెందారు. అయితే.. ఆయన మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. తన ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఇవాళ విజయవాడ భవానీ పురం పున్నమీఘాట్ హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కరాలు నిర్వహించనున్నారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట విషాదం
