Site icon NTV Telugu

ముంచుకొస్తున్న యాస్‌ తుఫాన్‌ : మంత్రి వెలంప‌ల్లి కీలక ఆదేశాలు

ఏపీలో యాస్‌ తుఫాన్‌ ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో యాస్‌ తుఫాన్‌పై అప్రమత్తం ఉండాలని ఫోన్‌లో విజయనగరం జిల్లా కలెక్టర్‌కు సూచిన‌లు ఇచ్చారు మంత్రి వెలంప‌ల్లి. యాస్‌ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని, ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌కు ఫోన్ లో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. చెరువులకు గండ్లు కొట్టకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక అటు యాస్ తుఫాన్ హెచ్చరికలతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. మొత్తం 74 సర్వీసులు రద్దు కాగా…తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాతే రైళ్లు పునరుద్ధరణ కానున్నాయి…
నిన్న 64 సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ.. ఈరోజు మరో 10రైళ్లు రద్దు చేసింది.

Exit mobile version