Site icon NTV Telugu

Minister Anitha: ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే పోలీసులే కారణం

Anitha

Anitha

Minister Anitha: మంగళగిరి APSP బెటాలియన్‍లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే పోలీసులే కారణం అన్నారు. పోలీస్ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అవసరం.. ఏపీ పోలీస్ నేర నియంత్రణలో ముందుంది.. ఆధునిక సాంకేతికతో ఏపీ పోలీసులు ముందుకు వెళ్తున్నారు అని మంత్రి అనిత పేర్కొనింది.

Read Also: Karoline Leavitt: ట్రంప్-పుతిన్ భేటీపై ప్రశ్న.. పరుష పదం ఉపయోగించిన కరోలిన్‌ లీవిట్‌

ఇక, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చిన్న నిర్లక్ష్యం కూడా జరగకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది అని మంత్రి వంగలపూడి అనిత తెలిపింది. ఏపీలో గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీం ఏర్పాటు చేశాం.. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చటం కోసం ప్రభుత్వం పని చేస్తోంది.. లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం.. పోలీస్ శాఖలో 6100 పోలీస్ నియామకాలు చేపట్టామని వంగలపూడి అనిత వెల్లడించింది.

Exit mobile version