Site icon NTV Telugu

Minister Satya Kumar: ఏపీలో మెడికల్ కాలేజీలపై వైఎస్ జగన్కు మంత్రి సత్యకుమార్ లేఖ..

Satya

Satya

Minister Satya Kumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు చేయడం తగదని సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని వైసీపీ అబద్దాలు చెప్తుంది.. రూ. 8480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం రూ. 1, 451 కోట్లకే బిల్లులు చెల్లించారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హాయంలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్లు తీసుకు రాలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

Read Also:Karuppu : సూర్య ‘కరుప్పు’ కు సంక్రాంతి కష్టాలు..

అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ లా కూటమి ప్రభుత్వం విఫలం కాకూడదనే పీపీపీ విధానం ఎంచుకున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలియజేశారు. పీపీపీకీ, ప్రైవేటీకరణకూ చాలా వ్యత్యాసం ఉందన్నారు. మెడికల్ కాలేజీలపై తన వివరణకు జగన్ స్పందించాలని కోరారు. మీరు చేయని వాటి గురించి కూడా చెప్పుకోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా మెడికల్ కాలేజీలపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version