NTV Telugu Site icon

RK Roja: చంద్రబాబు ఒక ఉన్మాది.. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు..!

Rk Roja

Rk Roja

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి ఆర్కే రోజా.. విశాఖ పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక ఉన్మాది అంటూ మండిపడ్డారు.. రాష్ట్రంలో దిశా యాప్ ద్వారా 900 మందిని రక్షించడం జరిగిందన్న ఆమె.. గతంలో ఏపీలో జరిగిన ఘటనలను ప్రస్తావించారు.. సెక్స్ రాకెట్ నడిపింది చంద్రబాబు నాయుడు కాదా..!? అంటూ ప్రశ్నించారు.. మహిళా తాసిల్దార్‌ను ఇసుకలో ఇడ్చింది టీడీపీ ఎమ్మెల్యే కాదా…? అని నిలదీసిన ఆమె.. కోడలు మగబిడ్డను కంటే బాగుణ్ణు అనుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, చంద్రబాబు అవసరం ఈ రాష్ట్రానికి ఏమీ లేదన్న మంత్రి ఆర్కే రోజా.. రానున్న రోజుల్లో 23 సీట్లు కూడా మీ పార్టీకి వచ్చే అవకాశం లేదంటూ జోస్యం చెప్పారు.

Read Also: Punjab: సీఎం మరో కీలక నిర్ణయం.. వారి భద్రత ఉపసంహరణ

కాగా, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం ఘటన విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ వెళ్లిన మంత్రి ఆర్కే రోజా.. విశాఖలో స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.