Site icon NTV Telugu

RK Roja: మాజీ మంత్రి బండారుపై రోజా పరువు నష్టం దావా

Rk Roja

Rk Roja

RK Roja Filed Defamation Case: టీడీపీ నేత బండారు సత్యనారాయణపై వైఎస్సార్ సీపీ మంత్రి ఆర్కే రోజా కేసు ఫైల్ చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బండారుతో పాటు మరో ఇద్దరిపై మంగళవారం నగరి కోర్టులో ఆమె పరువు నష్టం దావా వేశారు. ఇటీవల మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను కించపరిచే విధంగా వ్యవహరించిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, నగరి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గాలి భాను ప్రకాష్, టీవీ రాజేంద్ర ప్రసాద్‌లపై ఆమె వేసిన క్రిమినల్ ఢిఫమేషన్ పిటిషన్‌ను వేశారు. రోజా పిటిషను కోర్టు స్వీకరించింది. తనపై బండారు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని రోజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Exit mobile version