NTV Telugu Site icon

Minister RK Roja: చిరంజీవికి మంత్రి రోజా సవాల్.. వచ్చి చూస్తే తెలుస్తుంది

Roja Challenges Chiranjeevi

Roja Challenges Chiranjeevi

Minister RK Roja Challenges Chiranjeevi: ‘ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలే గానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి’ అని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా దిగొచ్చి.. చిరు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా చిరుకి మంత్రి రోజా ఓ సవాల్ విసిరారు. గడప గడపకు చిరంజీవి వచ్చి చూస్తే.. తాము ఏం అభివృద్ధి చేశామో, ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని ధ్వజమెత్తారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాన్ని అడుక్కున్నారని ప్రశ్నించారు. హీరోలు అందరూ కలిసి ఎందుకు జగన్ దగ్గరికి వెళ్లారని నిలదీశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మినహాయిస్తే.. ఏ ఇతర హీరోలు ప్రభుత్వాన్ని విమర్శించడం లేదన్నారు.

మోనాలిసా.. నీ అందానికీ దాసోహం అంటున్న యువత

సినిమా వేదికలపై ప్రభుత్వాన్ని తిడితే సహించేది లేదన్న మంత్రి రోజా.. రాజకీయాలు చేయాలని అనుకుంటే, రాజకీయాల్లో ఉండి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. అలా కాకుండా సినిమాలే చేయాలనుకుంటే, రాజకీయాల జోలికి రాకుండా సినిమాలే చేసుకోవాలని హితవు పలికారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ అభివృద్ధి చేసిన ఘనత జగన్‌ది అని చెప్పుకొచ్చారు. చిరంజీవి చెబితే విని, పనిచేసే పరిస్థితిలో జగన్ లేరన్నారు. కేంద్రమంత్రిగా చిరంజీవి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతుంటే.. చిరంజీవి అప్పుడేం చేశారని అడిగారు. హోదా గురించి అప్పుడు ఎందుకు చిరంజీవి అడగలేదు? అని ప్రశ్నించారు. కేంద్రంమంత్రిగా ఉండి చిరంజీవి ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? అని చెప్పారు.

Gabbar Singh: ఏం వార్త చెప్పావ్ బండ్లన్న… పవర్ స్టార్ రేంజ్ ఏంటో చూపిచండి!

ప్రజల తిరస్కారానికి గురైన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన చిరంజీవి.. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని రోజా పేర్కొన్నారు. తమ్ముడి మీద ప్రేమతో చిరంజీవి ఇలా మాట్లాడి, ఏదో బలాన్ని ఇవ్వాలని చూస్తున్నాడని అభిప్రాయపడ్డారు. తమని నమ్మకున్న వాళ్లను రోడ్డుమీదికి వదిలేసి.. వీళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారని కౌంటర్ వేశారు. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు.. మళ్లీ అన్నదమ్ములు కలిస్తే అలానే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.