Site icon NTV Telugu

Pinipe Viswarup : మంత్రి విశ్వరూప్‌ కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపులు.. వైరల్‌

Krishnareddy

Krishnareddy

ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అమలాపురం రూరల్‌ ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబును ఆయన ఫోన్‌లో బెదిరించినట్టు ఆరోపిస్తున్నారు. నా ఇంటికి నిప్పు పెడతారా మిమ్మల్ని చంపుతా అంటూ ఎంపీటీసీని మంత్రి తనయుడు బెదిరించినట్టు చెబుతున్నారు. తల్లి, భార్య పేరుతో అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా తీవ్రస్థాయిలో బెదిరించినట్టు ఆరోపిస్తున్నారు.

అయితే ఇది మంత్రి కుమారుడు కృష్ణారెడ్డి ఆడియోనా.. కాదా అని పరిశీలిస్తున్న పోలీసులు. అమలాపురం అల్లర్ల కేసులో వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబుపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే జరిగిన సంఘటనతో తనకు సంబంధం లేకపోయినా వైసీపీలో మరో వర్గం తనను ఇరికించారంటూ ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశాడు.

Exit mobile version