NTV Telugu Site icon

ఆర్టీసీ బస్సులో మంత్రి పెద్దిరెడ్డి..

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన రెండు బస్సు సర్వీసులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన బస్సు సర్వీసులో టికెట్ కొనుగోలు చేసి మంత్రి మంత్రి పెద్దిరెడ్డి బస్సులో ప్రయాణించారు. పుంగనూరు పరిధిలోని ఎస్.అగ్రహారం, ఏ.కొత్తకోట మధ్య విద్యార్థులకు అనువైన సమయంలో బడిబస్సు ఏర్పాటు చేశామన్నారు.

అంతేకాకుండా ప్రజల అవసరాల మేరకు పుంగనూరు నుండి మండల కేంద్రాల మీదుగా చిత్తూర్, అక్కడి నుండి చెన్నై కు వెళ్లేలా బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జగన్‌ పేద ప్రజలకు పెద్దపీట అభివృద్ధికి వేశారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.