దేశంలో 4వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంగళవారం విశాపట్నంలోని ఏయూ క్యాంపస్‌లో ప్రారంభించినట్టు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విశాఖ పట్నం నూతన పరిశ్రమలు స్థాపించడానికి అన్ని విధాలుగా అనువైన ప్రాంతంగా ఆయన పేర్కొన్నారు.2015 నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా – నాస్కమ్‌తో కలిసి ఈ ఎక్స్‌లెన్స్‌లను నిర్వహిస్తుందన్నారు. అగ్రికల్చర్, హెల్త్‌కేర్, గవర్నరెన్స్‌లకు ప్రాధాన్యతను ఇస్తూ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు.
యూనివర్సీటీలో ఇలాంటి ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని, వారిలో ఉన్న శక్తి, సామర్థ్యాలు బయటపడతాయని మంత్రి పేర్కొన్నారు. మిగతా రాష్ర్టాల్లో విద్యార్థులు పోటీ పడటానికి ఇది అవకాశం కల్పిస్తుందని ఆయన తెలిపారు. వీటితో పాటు “ఆ” హబ్ ద్వారా రాష్ర్టంలో మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇవే కాకుండా ఆమెజాన్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని, మరిన్ని అవకాశాలు కల్పించడానికి ఇతర సంస్థలతో చర్చలు జరుపుతామని మంత్రి తెలిపారు.
