Site icon NTV Telugu

AP High Court: తరలింపు అంశం.. రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం

Ap High Court Shifting

Ap High Court Shifting

Minister Kiran Rijiju About AP High Court Shifting: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్‌కి తరలించాలని 2019లోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే! అప్పటినుంచి ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. అప్పట్లోనే ఈ విషయంపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. సరిగ్గా ఇదే సమాధానాన్ని తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చారు.

హైకోర్టును కర్నూల్‌కి తరలించాలన్న ప్రతిపాదన కేంద్రానికి అందిందని చెప్పిన కిరణ్ రిజిజు.. ఈ తరలింపు వ్యవహారంపై హైకోర్టుతో సంప్రదింపులు జరిపి, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాదు.. హైకోర్టు నిర్వహణ ఖర్చులు సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు క‌లిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని.. ఆ త‌ర్వాతే తరలింపు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపాల్సి ఉంటుందని సూచించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోట‌గిరి శ్రీధ‌ర్‌, చింతా అనురాధా అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజిజు పై విధంగా స్పందించారు.

Exit mobile version