Site icon NTV Telugu

గులాబ్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్రలో భారీ పంట నష్టం…

గులాబ్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా పంట నష్టం జరిగింది అని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఒక లక్షా 56వేల 756 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. లక్షా 16 వేల ఎకరాల్లో వరి, 21వేల 78 ఎకరాల్లో మొక్కజొన్న ప్రధానంగా దెబ్బ తినింది. కృష్ణా జిల్లాలో సుమారు పదివేల ఎకరాల్లో పత్తి దెబ్బతినింది. అయితే ఇవి ప్రాథమిక అంచనాలు మాతర్మే అని అన్నారు. పొలాల్లో నీరు తగ్గిన తర్వాత తుది అంచనాలు వస్తాయి. 7 వేల 203 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం కలిగింది. ఆరువేల 700 మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు అధికారులు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. దీని కోసం ప్రత్యేకంగా అధికారులు, శాస్త్రవేత్తలను క్షేత్ర స్థాయికి పంపిస్తున్నాం అని స్పష్టం చేసారు.

Exit mobile version