NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: కాకాణి స్ట్రాంగ్ కౌంటర్.. కోటంరెడ్డి ద్రోహం చేశాడు

Kakani On Kotamreddy

Kakani On Kotamreddy

Minister Kakani Govardhan Reddy Fires On Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కోటంరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ విషయాన్ని రామశివారెడ్డి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా కోటంరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు అండగా నిలిచిన పార్టీకే ద్రోహం చేశాడని, అందుకే కోటంరెడ్డికి ఊహించిన ఎదురుదెబ్బలు తగులుతున్నాయని వ్యాఖ్యానించారు.

Kakinada Oil Factory: ఫ్యాక్టరీలో ఘోరప్రమాదం.. ఊపిరాడక ఏడుగురు మృతి

మంత్రి కాకాణి మాట్లాడుతూ.. ‘‘కోటంరెడ్డి చెప్పింది పచ్చి అబద్దమని శివారెడ్డి స్పష్టం చేశారు. శ్రీధర్‌రెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. అది ఫోన్ కాల్ రికార్డ్ మాత్రమేనని శివారెడ్డి చెప్పారు. నమ్మి ఆడియో క్లిప్ పంపితే, ఫోన్ ట్యాపింగ్ అని శ్రీధర్‌రెడ్డి రచ్చ చేస్తున్నారు. జరగని విషయాన్ని జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆడియో రికార్డులను ట్యాపింగ్‌ అని చెప్తున్నారు. జరిగింది ఫోన్ ట్యాప్ కాదు.. చంద్రబాబు ట్రాప్. కోటంరెడ్డి అబద్ధాలకు ఎల్లో మీడియా కూడా వత్తాసు పలుకుతోంది. ట్యాపింగ్‌ ఆరోపణలు నిజమే అయితే.. కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? తనకు అండగా నిలిచిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేశాడు కాబట్టి, అతనికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారు’’ అని చెప్పారు.

Bollywood: నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బాలీవుడ్ ప్రేమ జంట…

ఇదే సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కోటంరెడ్డి ప్రతీరోజు మీడియా సమావేశాల్లో పచ్చి డ్రామాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని, ఈరోజు వరకు తాను ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేశానని అన్నారు. ఈ మూడున్నరేళ్లలో కోటంరెడ్డి ఎన్ని అరాచకాలు చేశారో, అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని హెచ్చరించారు. కోటంరెడ్డికి పార్టీ, కార్యకర్తలు అవసరం లేదని.. డబ్బు మీద మాత్రమే ప్రేమ ఉందని ఆరోపించారు. అందుకే.. ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడలేదని పేర్కొన్నారు. త్వరలోనే కోటంరెడ్డి జాతకం బయటకు వస్తుందని.. కొన్ని రోజుల్లోనే ప్రజలకు అతని గురించి అన్ని విషయాలను తెలుస్తాయన్నారు. ప్రజల్ని, వ్యాపారుల్ని కోటంరెడ్డి ఎలా బెదిరించాడో అందరికీ తెలుసని, కాబట్టి జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చారు.