Site icon NTV Telugu

సంపూర్ణ గృహ హక్కు పథకంపై విమర్శలకు తావులేవు…

తూర్పుగోదావరిలో జిల్లా పరిషత్ సమావేశం వాడి వేడిగా సాగింది. సంపూర్ణ గృహ హక్కు పథకం, విద్య, వైద్యం, నాలుగు వ్యవసాయ అంశాల పైనే చర్చ జరిగింది. ఈ జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరును తప్పు పట్టి విమర్శలు చేసారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మేల్సీ చిక్కాల రామచంద్రరావు. దానిపై మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ… జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం భేష్. ఈ పథకంపై విమర్శలకు తావులేవు. రిజిస్ట్రేషన్ లు చేయించుకుంటే ఆర్థిక అవసరాల ఉపయోగం ఉంటుంది అన్నారు.

అలాగే రబీలో వరిసాగుకు నీటి కష్టాలు లేకుండా చూస్తాం. రబీ పనులు సత్వరం ప్రారంభించి ఏప్రిల్ 15 నాటికి పంటలు చేతికి అందేలా చర్యలు చేపట్టాలి అని మంత్రి కన్నబాబు సూచించారు.

Exit mobile version