NTV Telugu Site icon

Botsa Satyanarayana: చంద్రబాబు మాదిరిగా సీఎం జగన్‌ మోసం చేయలేదు..

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతులకు వివాహ సహకారం కోసం కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చంద్రబాబు మాదిరిగా సీఎం జగన్‌ మోసం చేయలేదనన్న ఆయన.. మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను జగన్‌ అమలు చేశారన్నారు. కళ్యాణమస్తుతో పేదింటి ఆడపిల్లలకు సీఎం అండగా నిలిచారన్నారు. ఏ పథకం ప్రారంభించినా కొందరు కావాలనే విషం చిమ్ముతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vidadala Rajini: చంద్రబాబు కుట్రలో భాగమే ఈ అమరావతి రైతుల యాత్ర..

పెళ్లికూతురు కచ్చితంగా 10వ తరగతి పాసై ఉండాలనే నిబంధన పెట్టారని.. అక్టోబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందన్నారు. మూడున్నర ఏళ్లలోనే మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం పథకాలు పూర్తి చేయటం ఒక రికార్డు అని అన్నారు. ఉచిత ఇసుక అని పేరు పెట్టి టీడీపీ అంతా దోచుకుందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆలోచనను పక్కదారి పట్టించేందుకే కొన్ని పత్రికలు లేనిపోని కథనాలు రాస్తున్నాయన్నారు. అమరావతి టు అరసవల్లి పాదయాత్ర అంటున్నారని.. అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కానవసరం లేదా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. చంద్రబాబు చెవిలో పూలు పెడితే వినటానికి ఏమైనా చిన్నపిల్లలమా అని ఆయన పేర్కొన్నారు. పదే పదే అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.