Site icon NTV Telugu

నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం : బొత్స సత్యనారాయణ

అనంతపురం వచ్చిన వరదలపై సమీక్షలో పంట నష్టాలపై చర్చ చర్చించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అందులో జిల్లాలో 50 శాతానికి పైగా పప్పు శనగ పంట నష్టం వాటిల్లిందని అధికారుల వివరణ ఇచ్చారు. అధికారుల లెక్కలపై పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ క్రాప్ నమోదు కాకపోవడం పై కేశవ్ మండిపడ్డారు. పప్పుశనగ సహా పాడైన పంట లను వెంటనే ఈ క్రాప్ నమోదు చేయండి. అధికారులు పంట లు వేసినవే 50 శాతం తగ్గించారు. అధికారుల లెక్కలపై కేశవ్, అనంత వెంకట రామిరెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కు సమీక్షా నుంచే ఫోన్ లో మాట్లాడిన మంత్రి బొత్స… వెంటనే ఈ క్రాప్ నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Exit mobile version