Site icon NTV Telugu

సీఎం జగన్ వున్నంత వరకు లోకేష్ జీరోనే !

Avanthi Srinivas

Avanthi Srinivas

రమ్య హత్యను పని లేని టిడిపి నాయకులు రాజకీయం చేస్తున్నారని…లోకేష్ బరువు తో పాటు విచక్షణ కోల్పోయారని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. సీఎం గా జగన్ మోహన్ రెడ్డి వున్నంత వరకు లోకేష్ జీరోగా నే వుంటారని… గ్రామ స్థాయి నాయకులు కంటే తక్కువగా లోకేష్ భాష వుందని చురకలు అంటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పై వ్యక్తి గత దూషణలకు లోకేష్ దిగడం దారుణమన్నారు. స్టేషన్ నుంచి విడుదలైన లోకేష్ ఏదో విజయం సాధించినట్టు ప్రవర్తించడం అతని అవివేకమని ఫైర్‌ అయ్యారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు టిడిపికి చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు లేదన్నారు. వైయస్ కుటుంబం దళితుల అభివృద్ధి లో ఎంతో భాగస్వామ్యం అయ్యారని మంత్రి అవంతి పేర్కొన్నారు.

Exit mobile version