NTV Telugu Site icon

Minister Appalaraju: మనకూ శ్రీలంకకు పోలికేంటి? ఏంటీ గోల?

Sappalaraju

Sappalaraju

ఏపీలో అప్పులపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే వుంది. ఏపీ శ్రీలంకలా మారిపోయిందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు విపక్షాల విమర్శలపై హాట్ కామెంట్లు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేయాలని ప్రయత్నిస్తుంటే , చంద్రబాబు బృందం రాద్ధాంతం చేస్తుంది.

మన రాష్ట్రాన్ని ప్రక్కనున్న శ్రీలంక దేశంతో చంద్రబాబు పోల్చుతున్నారు. మనరాష్ట్రానికి శ్రీలంక దేశానికి పోలికేంటి..? మన రాష్ట్రం శ్రీలంక, వెనిజులా అయిపోతుందని, అప్పులపాల చేసేస్తున్నారని చంద్రబాబు గోల చేస్తున్నారు. అమ్మ ఒడి, రుణమాఫీ, చేయూత డబ్బులు వేయడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు.

ప్రజలకు ఏ ఒక్క పథకం ద్వారానైనా లబ్ది చేకూర్చుదామంటే వెంటనే మైకుల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచేస్తున్నాడని గోలగోల చేయడం చంద్రబాబుకు అలవాటు అయిపోయిందని మండిపపడ్డారు. ప్రజలకు ఇచ్చే ప్రతి రూపాయి ఆపడానికి కోర్టులలో కేసులు వేయడం చంద్రబాబుకు అలవాటే అని ఎద్దేవా చేశారు. దీనిని మనందరం సమిష్టిగా త్రిప్పి కొట్టాలని ప్రతి అక్కకీ, ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తున్నా అన్నారు మంత్రి అప్పలరాజు.

Vizag Steel Plant: విశాఖ ఉక్కు రికార్డు టర్నోవర్‌.. ఎంతంటే?